హాంబర్గ్: ప్రపంచ చెస్ చాంపియన్ డీ గుకేశ్(Gukesh).. జర్మనీలోని జరుగుతున్న ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్ స్లామ్లో ఓటమి చెందాడు. ఇరానియన్-ఫ్రెంచ్ గ్రాండ్‌మాస్టర్ అలిరేజా ఫిరౌజాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన గుకేశ్ ఆ టోర్నీలో చిట్టచివరి స్థానంలో నిలిచాడు. విసెనౌస్ రిసార్టులో జరుగుతున్న టోర్నీలో అతను ఒక్క గెలుపు కూడా లేకుండా ముగించేశాడు. తొలి రోజు మ్యాచ్‌ను డ్రాగా ముగించినా.. ఆ తర్వాత అతను కోలుకోలేకపోయాడు. లోకల్ ఫెవరేట్ ప్లేయర్ విన్సెంట్ కీమర్ తొలి ఎడిషన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అయితే ఫిడే మాత్రం ఫ్రీస్టయిల్ చెస్ టోర్నీకి గుర్తింపు ఇవ్వలేదు.