లాహోర్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లు పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ) విచారణకు హాజరయ్యారు. డ్రెస్సింగ్ రూమ్‌లో విషయాలను లీక్ చేశారనే ఆరోపణతో ఈ ఇద్దరినీ సైబర్ క్రైమ్ ఏజెన్సీ నాలుగు గంటల పాటు విచారించినట్టు ఆ దేశానికి చెందిన జియో న్యూస్ ఓ కథనంలో పేర్కొంది.
విచారణ సందర్భంగా ఈ ఇద్దరి ఆటగాళ్ల ఫోన్లు స్వాదీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపినట్టు తెలుస్తున్నది. అలాగే వీరి బ్యాంకు ఖాతాలపైనా సైబర్ క్రైమ్ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.