బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా 24 ఏళ్ల లవ్‌ప్రీత్ సింగ్ కూడా సత్తాచాటాడు. కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 109 కేజీల విభాగంలో పోటీ పడిన అతను.. ఏకంగా 355 కేజీలు ఎత్తాడు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో తన పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో అతన్ని కాంస్య పతకం వరించింది.
బర్మింగ్‌హామ్‌లో స్నాచ్ విభాగంలో 163 కేజీలు ఎత్తిన లవ్‌ప్రీత్ సింగ్.. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 192 కేజీలు ఎత్తి సత్తాచాటాడు. ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం మొత్తం 14 పతకాలు సాధించగా.. వాటిలో 9 పతకాలు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం గమనార్హం.