Ashes Series : యాషెస్ సిరీస్‌లో అదిరే బోణీ కొట్టిన ఆస్ట్రేలియా (Australia) రెండో మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది. పెర్త్ టెస్టు (Perth Test)లో సంచలన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను రెండో రోజే మట్టికరిపించిన ఆసీస్ బ్రిస్బేన్‌లోనూ తడాఖా చూపేందుకు సిద్ధమవుతోంది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టు స్టార్ పేసర్ల సేవల్ని కోల్పోనుంది. గాయం నుంచి కోలుకుంటున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. దాంతో.. తొలి టెస్టు స్క్వాడ్‌తోనే కంగారూ టీమ్ రెండో మ్యాచ్ ఆడనుందని శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
యాషెస్‌లో మొదటిదైన పెర్త్ టెస్టులో సంచలన విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో ముందంజ వేసింది. కెప్టెన్ కమిన్స్, హేజిల్‌వుడ్ వంటి ప్రధాన పేసర్లు లేకున్నా.. మిచెల్ స్టార్క్, బొలాండ్‌లు నిప్పులు చెరిగారు. 205 పరుగుల ఛేదనలో ట్రావిస్ హెడ్ (Travis Head) విధ్వంసక శతకంతో రెండో రోజే ముగించిన ఆసీస్.. అదే ఉత్సాహంతో బ్రిస్బేన్ టెస్టులో బరిలోకి దిగనుంది.
JUST IN: No return for injured captain Pat Cummins as Australia name an unchanged squad for the day-night Ashes Test at the Gabba pic.twitter.com/ue8bAX99Ev
— ESPNcricinfo (@ESPNcricinfo) November 28, 2025
కానీ.. రెండో టెస్టు వరకూ కూడా కమిన్స్, హేజిల్‌వుడ్‌లు ఫిట్నెస్ సాధించేలా లేరు. దాంతో.. రెండో మ్యాచ్‌కు స్టీవ్ స్మిత్ సారథిగా కొనసాగనున్నాడు. అలానే.. తొలి మ్యాచ్‌లో వెన్నునొప్పితో ఇబ్బందిపడిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా స్క్వాడ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌కు దూరమైనప్పటికీ జట్టుతోనే ఉంటూ ప్రాక్టీస్ కొనసాగించనున్నాడు కమిన్స్. డిసెంబర్ 3 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బాలో రెండో టెస్టు జరుగనుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : స్టీవ్ స్మిత్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండన్ డొగెటే, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నాసిర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్లాండ్, బ్యూ వెబ్‌స్టర్.