T20 World Cup 2026 : స్వదేశంలో యాషెస్ సిరీస్ కైవసం చేసకున్న ఆస్ట్రేలియా పొట్టి ప్రపంచకప్ లక్ష్యంగా పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందిని ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకుంటున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins), జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్‌లు స్క్వాడ్‌లోకి వచ్చారు. మిచెల్ మార్ష్ (Mitchell Marsh) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌కప్
మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి పొట్టి కప్ పట్టేయాలనే పట్టుదలతో ఉంది. అందుకని సన్నాహక సిరీస్‌తో కలిపి వరల్డ్ కప్ కోసం 15 మందిని ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఇటీవలే భారత్‌పై చెలరేగిపోయిన కూపర్ కొన్నెల్లి. బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమన్ వంటి కుర్రాళ్లకు వరల్డ్ కప్ బెర్తు దక్కింది.
Pat Cummins, Josh Hazlewood and Tim David, all on comeback trails from injury, have been named in Australia’s preliminary squad for the T20 World Cup. pic.twitter.com/hQ835IpnEn
— Cricbuzz (@cricbuzz) January 1, 2026
‘ఇటీవల టీ20ల్లో ప్రదర్శనను, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని స్క్వాడ్‌ను ఎంపిక చేశాం. భారత్, శ్రీలంకలోని పరిస్థితులకు సరిపోయే ఆటగాళ్లకు ప్రాధాన్యమిచ్చాం. హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ల ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఈ ముగ్గురు ప్రపంచకప్‌లో ఆడుతారని నమ్ముతున్నాం. అయితే.. ఇది ప్రిలిమినరీ స్క్వాడ్ మాత్రమే. మార్పులు చేర్పులు జరిగే అవకాశముంది’ అని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు.
Introducing our squad for next month’s #T20WorldCup in India and Sri Lanka! 🔥 pic.twitter.com/mtlxGRrdCC
— Cricket Australia (@CricketAus) January 1, 2026
ఐపీఎల్ 19వ సీజన్ మినీ వేలంలో రికార్డు ధర (రూ.25.20 కోట్లు) పలికిన కామెరూన్ గ్రీన్, బిగ్‌బాష్ లీగ్‌లో గాయపడిన ఆర్సీబీ హిట్టర్ .. ఊహించనట్టుగానే స్క్వాడ్‌లోకి వచ్చారు. అలానే సీనియర్లు మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆసీస్ జట్టు ప్రపంచకప్ కంటే ముందు పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. పాక్‌తో సిరీస్‌లో కమిన్స్, హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్ ఆడే అవకాశముంది.వచ్చే ఫిబ్రవరి 7 భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. గ్రూప్ బీలోని ఆస్ట్రేలియా తమ మ్యాచ్‌లను శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలె స్టేడియాల్లో ఆడనుంది.
ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, గ్జావియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నొలి, ప్యాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, మాథ్యూ కహ్నేమన్, ఆడం జంపా.