IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆసక్తికర సమరానికి వేళైంది. ఐదు టైటిళ్లతో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య ఉత్కంఠ పోరాటం మరికాసేపట్లో మొదలవ్వనుంది. చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా లేకుండా బరిలోకి దిగుతున్న ముంబై భారీ స్కోర్ సాధించడంపై కన్నేసింది.
ముంబై జట్టు : రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధిర్, రాబిన్ మింజ్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్.
చెన్నై జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివం దూబే, రవీంద్ర జడేజా, సామ్ కరన్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్.