బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు రాబిన్ ఊతప్ప (88), శివమ్ దూబే (95 నాటౌట్) రాణించడంతో ఏకంగా 216 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు ఆరంభంలోనే తడబడింది. కెప్టెన్ డుప్లెసిస్ (8), అనూజ్ రావత్ (12), కోహ్లీ (1) ముగ్గురూ తీవ్రంగా నిరాశ పరిచారు.
ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 26) కొంత ఆశలు రేపినా.. జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపు షాబాజ్ నదీమ్ (41), సూయష్ ప్రభుదేశాయి (34) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అదే సమయంలో కావలసిన రన్ రేట్ భారీగా పెరగకుండా కూడా జాగ్రత్త పడ్డారు. చివర్లో వానిందు హసరంగ (7), ఆకాష్ దీప్ (0) అవుటైనప్పటికీ.. దినేష్ కార్తీక్ (34) క్రీజులో ఉండటంతో బెంగళూరు విజయంపై పూర్తిగా ఆశలు చావలేదు.
ఇలాంటి సమయంలో బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు డీకే ప్రయత్నించాడు. సరిగ్గా బౌండరీ లైన్ మీద దాన్ని జడేజా అందుకోవడంతో డీకే వెనుతిరిగాడు. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్‌గా ఉన్న చెన్నై అభిమానులు దాంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్లో తొలిసారి విజయం నమోదు చేసింది. 23 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. చెన్నై బౌలర్లలో మహీష్ తీక్షణ 4, జడేజా 3 వికెట్లు తీయగా.. డ్వేన్ బ్రావో, ముకేష్ చౌదరి చెరో వికెట్ తీసుకున్నారు.
First win ku #WhistlePodu 🥳💛#CSKvRCB #Yellove 🦁 pic.twitter.com/VJtaA92h22
— Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022