బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నైకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లేమితో బాధపడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. మూడు బౌండరీలతో 17 పరుగులు చేశాడు. అలాంటి సమయంలో జోష్ హాజిల్‌వుడ్ వేసిన బంతిని మరో బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించి మిస్ అయ్యాడు. బంతి అతని తొడను తాకి వెనక్కు వెళ్లింది.
అయితే ఆర్సీబీ జట్టు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గైక్వాడ్ రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా బంతి బ్యాట్‌ను తాకలేదని స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో వికెట్ల పైభాగాన్ని తాకే అవకాశం ఉన్నట్లు తేలడంతో రుతురాజ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 19 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో మొయీన్ అలీ వచ్చాడు.