ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. కాన్వే (0), మొయీన్ అలీ (0)ని తొలి ఓవర్లోనే వెనక్కు పంపిన డానియల్ శామ్స్.. ముంబైకి అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత కాసేపటికే బుమ్రా బౌలింగ్‌లో ఊతప్ప (1) కూడా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఆడటానికి ప్రయత్నించిన రుతురాజ్ (7)ను కూడా శామ్స్ అవుట్ చేశాడు. అతను వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడే క్రమంలో.. ఎడ్జ్ తీసుకున్న బంతిని ఇషాన్ కిషన్ అందుకోవడంతో రుతురాజ్ పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత ఒక బౌండరీ బాదిన అంబటి రాయుడు (10)ను మరుసటి బంతికే రైలీ మెరెడిత్ అవట్ చేశాడు. మెరెడిత్ వేసిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని ఇషాన్ కిషన్‌కు సులభమైన క్యాచ్ దక్కింది. దాన్ని అతను అందుకోవడంతో రాయుడు ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై జట్టు ఐదు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసిన కాసేపటికే మెరెడిత్ బౌలింగ్‌లో షార్ట్ బంతిని ఆడబోయిన దూబే (10) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై జట్టు 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.