IPL 2023 : ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కాలంటే గెలవక తప్పని గేమ్‌లో ఆల్‌రౌండ్ షో చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 77 పరుగుల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. దాంతో, అత్యధికంగా 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే(87 : 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రుతురాజ్ గైక్వాడ్(79 : 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగడంతో చెన్నై 223 రన్స్ కొట్టింది. ఆ తర్వాత బౌలర్లు ఢిల్లీ బ్యాటర్ల పని పట్టారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(86 : 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో వార్నర్ సేన 146 రన్స్‌కే పరిమితమైంది.
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో ఫిఫ్టీ బాదిన పృథ్వీషా(5)ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేశాడు. ఆ తర్వాత ఫిలిఫ్ సాల్ట్(3), రిలే రస్సో(0)ను వరుస బంతుల్లో దీపక్ చాహర్ పెవిలియన్ పంపాడు. దాంతో, కష్టాల్లో పడిన ఢిల్లీని కెప్టెన్ వార్నర్(86) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్లో వార్నర్ రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. యశ్ ధూల్(15), అక్షర్ పటేల్(15), లలిత్ యాదవ్(6), అమన్ హకీం ఖాన్(7) విఫలయమ్యారు దీపక్ చాహర్ 2, పథిరన, థీక్షణ రెండేసి వికెట్లు పడగొట్టారు. జడేజా, దేశ్‌పాండేకు ఒక్కో వికెట్ దక్కింది.
𝙇𝙚𝙩 𝙩𝙝𝙚 𝙬𝙝𝙞𝙨𝙩𝙡𝙚𝙨 𝙗𝙚𝙜𝙞𝙣 🥳
𝗖𝗛𝗘𝗡𝗡𝗔𝗜 𝗦𝗨𝗣𝗘𝗥 𝗞𝗜𝗡𝗚𝗦 have qualified for the #TATAIPL 2023 Playoffs 💪🏻#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/xlSNgjq09B
— IndianPremierLeague (@IPL) May 20, 2023
భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే(87 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రుతురాజ్ గైక్వాడ్(79 నాటౌట్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ,సిక్సర్ల శివం దూబే(22 9 బంతుల్లో 3 సిక్స్‌లు) ధనాధన్ ఆడాడు. ఆఖరి ఓవర్లలో రవీంద్ర జడేజా దంచడంతో సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఐపీఎల్లో మొదట బ్యాటింగ్ చేసి అత్యధికంగా 22 సార్లు రెండొందలు కొట్టిన జట్టుగా ధోనీ సేన రికార్డు కొట్టింది. ఢిల్లీ బౌలర్లలో సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్జ్ ఒక్కో వికెట్ తీశారు.