IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో కీలక పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ఇప్పటివరకూ టోర్నీలో బోణీ కొట్టనిరాజస్థాన్ రాయల్స్.. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) గువాహటిలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ తీసుకున్నాడు. చెన్నై కంటే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యమని చెప్పాలి.
ఎందుకంటే.. గత రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ చిత్తుగా ఓడింది. హ్యాట్రిక్ ఓటమి తప్పాలంటే ఆ జట్టు కచ్చితంగా గెలిచి తీరాలి. ఇక సీఎస్కే విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో తమ సొంత ఇలాకాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి చెపాక్‌లో తొలి విజయం సొంతమైంది.
🚨 Toss 🚨@ChennaiIPL won the toss and elected to bowl against @rajasthanroyals
Updates ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK pic.twitter.com/HFXVecPbCg
— IndianPremierLeague (@IPL) March 30, 2025
సీఎస్కే తుది జట్టు : రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, శివం దూబే, రవీంద్ర జడేజా, ధోనీ(వికెట్ కీపర్), అశ్విన్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మథీశ పథిరన.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రానా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హిట్మైర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీశ థీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.