MS Dhoni | టీమిండిగా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ మిస్టర్ కూల్‌కి కార్లు, బైక్‌లు అంటే అమితమైన పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏ వాహనం వచ్చిన తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోనీ గ్యారేజీలో ఎన్నో లగ్జరీ కార్లు, బైక్‌లు ఉన్నాయి. తాజాగా ధోనీ మరో కొత్త వాహనాన్ని తన గ్యారేజీలోకి చేర్చాడు.
ఫైవ్ సీటర్‌తో కూడిన ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘కియా ఈవీ6’ కారును కొనుగోలు చేశాడు. సహచర ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌తో కలిసి కొత్త కారులో రాంచీ వీధుల్లో సరదాగా రైడ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
New Car in the house babyyy @msdhoni 😎pic.twitter.com/73ZZMxF4hv
— Best of MS Dhoni. (@BestOfMSD) November 17, 2022