MS Dhoni : పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్. అనుభవజ్ఞుడు, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) రెండు వారాల కంటే ఎక్కువ రోజులే ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశముంది. చిన్నస్వామిలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ టాస్ సందర్భంగా ధోనీ గురించి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కీలక విషయం వెల్లడించాడు.
ఐపీఎల్ ఆరంభ నుంచి ఆడుతున్న ధోనీ ఈసారి ఇంకా మైదానంలోకి దిగలేదు. టోర్నీ మొదలై వారం కావొస్తున్నా తాలా పునరాగమనంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదట రెండువారాలే అందుబాటులో ఉండడని సూపర్ కింగ్స్ యాజమాన్యం చెప్పినా.. ఆ సమయం మరింత పెరిగేలా కనిపిస్తోంది. స్వయంగా ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ సందర్భంగా ధోనీ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చాడు.
Ruturaj Gaikwad said MS Dhoni is coming to track slowly, he’s eager to play. Good news soon. pic.twitter.com/7mWOrIIIXC
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) April 5, 2026
‘ధోనీ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కొన్నిసార్లు మరింత సమయం పట్టొచ్చు. అతడు మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉంటే కచ్చితంగా ఆడిస్తాం. అయితే.. అందుకు కాస్త టైమ్ పట్టేలా ఉంది’ అని గైక్వాడ్ తెలిపాడు. కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన ధోనీ గైర్హాజరీలో సీఎస్కే పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్.. రెండో మ్యాచ్ పంజాబ్ ధాటికి చెన్నై తేలిపోయింది.
🚨 GOOD NEWS FOR CSK FANS 🚨
MS Dhoni was spotted traveling with the team bus to M. Chinnaswamy Stadium 🔥
He has also started practicing in the nets — looks like he’ll be back on the field for the CSK crowd very soon ❤️#RCBvsCSK #CSKvsRCB pic.twitter.com/NTFL1i63d7
— T-Celebs (@t_celebs) April 5, 2026
ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్ కోసం టీమ్ బస్సులో ధోనీ కెప్టెన్, జట్టు సభ్యులతో కలిసి చిన్నస్వామికి వచ్చాడు. దాంతో.. వారంలోపు తాలా ఫిట్నెస్ సాధించి.. మ్యాచ్‌కు సిద్ధమయ్యే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.