Team India Coach | టీం ఇండియాకు కొత్త కోచ్‌ని వెతికే పనిలో పడింది బీసీసీఐ. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇక ముందు కొనసాగడానికి సుముఖంగా లేరు. ఎన్సీఏ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ పేరు బీసీసీఐ పరిశీలనలో ఉంది. అయితే, విదేశీ కోచ్‌లను నియమించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ వెల్లడించింది. ఆ జాబితాలో ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు బలంగా వినిపిస్తున్నది.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం కోచ్‌గా జట్టును న్యూజిలాండ్ మాజీ సారధి స్టీఫెన్ ఫ్లెమింగ్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఆయన హయాంలోనే సీఎస్కే ఐదు సార్లు ఐపీఎల్ టోర్నీని గెలుచుకుని ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. టీం ఇండియా కొత్త కోచ్‌గా ఫ్లెమింగ్ స్టీఫెన్ పేరు వినిపిస్తుండటంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ కొట్టి పారేశారు. దీనిపై తమకెలాంటి సమాచారం లేదన్నారు. తాను అటువంటి వార్తలు వినలేదన్నారు. ఫ్లెమింగ్ కు గానీ, టీంకు గానీ ఈ విషయమై ఎటువంటి సమాచారం లేదన్నారు.