బెల్గ్రేడ్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కోపంతో విసిరికొట్టిన ఓ ఆర్మ్‌బ్యాండ్ వేలంలో 75వేల డాలర్ల (దాదాపు రూ.55లక్షలు)కు అమ్ముడైంది. గతవారం ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో ఓ దశలో తీవ్ర ఆగ్రహానికి గురైన పోర్చుగల్ సారథి రొనాల్డో కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్‌ను మైదానంలోనే పడేసి డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు. దీన్ని సేకరించిన సెర్బియాకు చెందిన ఓ హ్యుమానిటేరియన్ గ్రూప్.. ఆరు నెలల బాలుడి వెన్నెముక కండరాల చికిత్సకు సాయం చేసేందుకు వేలం వేసింది. దీంతో ఓ వ్యక్తి ఆ ఆర్మ్‌బ్యాండ్‌ను 75వేల డాలర్లకు దక్కించుకున్నార