న్యూజెర్సీ : అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లలో ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఇటీవల సౌదీ అరేబియా క్లబ్ అల్‌నాసర్‌కు మారిన తరువాత రొనాల్డో పారితోషికం మూడేళ్ల కాలానికి 136 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది.
పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్‌కు చెందిన మెస్సి (130మిలియన్ డాలర్లు), కిలియన్ ఎంబాపె (110 మిలియన్ డాలర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.