కోల్‌కతా: భారత క్రికెటర్ మహమ్మద్ షమీ(Mohammed Shami).. ఇవాళ సిర్ ముందు హాజరయ్యారు. ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అధికారుల ఆదేశాల ప్రకారం ఆయన సిర్ ఆఫీసర్ల ముందు ప్రత్యక్షమయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని బిక్రంఘర్ ఏరియాలో ఉన్న ఓ స్కూల్‌కు షమీ వెళ్లాడు. షమీ నింపిన ఎన్యుమరేషన్ దరఖాస్తులో కొన్ని ఖాళీలు ఉన్నట్లు ఈసీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయనకు సమన్లు జారీ చేశారు. ఆ నోటీసుల ప్రకారం ఇవాళ క్రికెటర్ షమీ ఎన్నికల అధికారుల ముందు హాజరయ్యారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన షమీ.. కొన్నేళ్ల నుంచి కోల్‌కతాలో ఉంటున్నారు. క్రికెట్ కెరీర్ నిమిత్తం ఆయన తన అడ్రెస్ మార్చుకున్నారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వార్డు నెంబర్ 93లో షమీ నివాసం ఉన్నది. ఇది రాశ్బిహారీ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వస్తుంది. కోచ్ సలహా మేరకు యుక్త వయసులోనే షమీ బెంగాల్‌కు వలస వెళ్లాడు.బెంగాల్ మాజీ రంజీ కెప్టెన్ సంబరన్ బంద్యోపాధ్యాయ శిక్షణలో బెంగాల్ అండర్-22కు షమీ ఆడాడు.
బెంగాల్ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడిన షమీ గత హియరింగ్‌కు హాజరుకాలేదు. దీంతో ఆయన ఇవాళ సిర్ అధికారులు ముందు హాజరయ్యారు.