న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రేగ్ ఫల్టన్ ఎంపికయ్యాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ కోచింగ్ అనుభవమున్న ఫల్టన్ను నియమించినట్లు హాకీ ఇండియా(హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీ నుంచి భారత హాకీ జట్టుతో కలిసి ఫల్టన్ పనిచేయనున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున పదేండ్లు ఆడిన క్రేగ్ ఫల్టన్ 195 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహిచాడు. ఇటీవల సొంతగడ్డపై జరిగిన హాకీ ప్రపంచకప్లో జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఆస్ట్రేలియాకు చెందిన గ్రహం రీడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.