Courtney Walsh : ఒకప్పడు బుల్లెట్ వేగంతో బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పేసర్ అతడు. ఈసారి కోచ్‌గా ఈతరం బ్యాటర్లకు దడ పుట్టించేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి పేరు కోర్ట్నీ వాల్ష్ (Courtney Walsh). వెస్టిండీస్ తొలి తరం క్రికెటర్లలో ఒకడైన వాల్ష్ జింబాబ్వే (Zimbabwe) బౌలింగ్ కన్సల్టంట్గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు ఈ వెటరన్ పేసర్‌ను బౌలింగ్ గురుగా తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ బోర్డు శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
గత సీజన్లో పొట్టి ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించని జింబాబ్వే ఈసారి సంచలన ఆటతో బెర్తు దక్కించుకుంది. సికిందర్ రజా సారథ్యంలో అదరగొడుతున్న ఆఫ్రికా జట్టు ఈ దఫా పెద్ద టీమ్‌లకు షాకివ్వాలనుకుంటోంది. అందుకని.. కోచింగ్ యూనిట్‌ను పటిష్టం చేస్తూ పేస్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్కు బౌలింగ్ కన్సల్టంట్ పదవిని కట్టబెట్టింది జింబాబ్వే క్రికెట్. తనకు ఈ అవకాశం రావడం పట్ల వాల్ష్ సంతోషం వ్యక్తం చేశాడు.
ZIMBABWE Cricket (ZC) has engaged West Indies fast-bowling legend Courtney Walsh as bowling consultant for the senior men’s national team ahead of the ICC Men’s T20 World Cup 2026, to be co-hosted by India and Sri Lanka from 7 February to 8 March.https://t.co/wuxSdgKYFD pic.twitter.com/lEe82Mpkhh
— ZBC News Online (@ZBCNewsonline) January 17, 2026
‘జింబాబ్వే క్రికెట్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా. తదుపరి సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నా. ఈసారి మా ప్రణాళికలను అమలు పరిచి.. సమిష్టిగా రాణిస్తే మాకు ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించే అవకాశాలున్నాయి. ఈ మధ్య జింబాబ్వే బౌలింగ్ యూనిట్ గొప్ప ప్రదర్శన చేస్తోంది. వరల్డ్ కప్ స్క్వాడ్‌లోని ఆటగాళ్లలో అంతులేని ప్రతిభ ఉంది’ అని వాల్ష్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం కలిగిన వాల్ష్ రాకతో జింబాబ్వే జట్టు సాంకేతికంగా మెరుగవుతుందని ఆ దేశ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోని పేర్కొన్నాడు.
LEGEND ON BOARD! 🇿🇼🤝
Zimbabwe have appointed West Indies great Courtney Walsh as their bowling consultant for the T20 World Cup 2026! 🏆
A massive boost for the Chevrons’ pace attack ahead of the big tournament. 🔥🏏#ZimbabweCricket #CourtneyWalsh #T20WorldCup #Cricket pic.twitter.com/DtAJkrcSrr
— wicketbuzz (@wicketbuzz) January 17, 2026
తొలితరం పేసర్లలో అరవీర భయంకరుడిగా పేరొందిన కోర్ట్నీ వాల్ష్ 1984లో తొలి మ్యాచ్ డాడు. తన పేస్ పవర్‌తో అగ్రశ్రేణి బ్యాటర్లను సైతం బెంబేలెత్తించిన ఈ పొడగరి పేస్ గన్ 2001లో వీడ్కోలు పలికాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఈ దిగ్గజ పేసర్ 132 టెస్టులు ఆడి 519 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదొందల వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడీ కరీబియన్ మాజీ క్రికెటర్. ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలవ్వనుంది. గ్రూప్ బీలోని జింబాబ్వే కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఫిబ్రవరి 9న ఒమన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక ఉన్నాయి.