న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దేశ రాజధానిలోని ఛత్రాసాల్ స్టేడియంలో జరిగిన యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో ప్రమేయం ఉందంటూ ఢిల్లీ పోలీసులు ఈ ఏడాది మే 23న సుశీల్‌ను అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి అతడు జైళ్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మంగళవారం సుశీల్ తరఫు న్యాయవాది అభ్యర్థించగా.. అడిషనల్ సెషన్స్ న్యాయవాది శివాజీ ఆనంద్ అందుకు నిరాకరించారు. దేశంలో రెజ్లింగ్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చిన సుశీల్ కుమార్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు (బీజింగ్‌లో కాంస్యం, లండన్‌లో రజతం) అందించిన విషయం తెలిసిందే.