IPL 2023 : ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే(87 : 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రుతురాజ్ గైక్వాడ్(79 : 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ,సిక్సర్ల శివం దూబే(22 9 బంతుల్లో 3 సిక్స్‌లు) ధనాధన్ ఆడడంతో సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఐపీఎల్లో మొదట బ్యాటింగ్ చేసి అత్యధికంగా 22 సార్లు రెండొందలు కొట్టిన జట్టుగా ధోనీ సేన రికార్డు కొట్టింది.
టాస్ గెలిచిన చెన్నైకి ఓపెనర్లు డేవాన్ కాన్వే(87), రుతురాజ్ గైక్వాడ్(79), శుభారంభం ఇచ్చారు. గైక్వాడ్ అయితే.. రెచ్చిపోయి ఆడాడు. అతని జోరు చూస్తుంటే సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ, చేతన్ సకారియా అతడిని బోల్తా కొట్టించాడు. అతను ఔటయ్యాక కాన్వే వేగం పెంచాడు. శివం దూబేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖరి ఓవర్లలో రవీంద్ర జడేజా దంచాడు. దాంతో, చెన్నై, ఢిల్లీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్లలో సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్జ్ ఒక్కో వికెట్ తీశారు.
Two in Two 💥💥@Ruutu1331 takes the aerial route and smacks quality maximums 🙌#TATAIPL | #DCvCSK pic.twitter.com/rWvzo6M2BG
— IndianPremierLeague (@IPL) May 20, 2023