IPL 2023 : చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ఆర్సీబీ ముందు 227 పరుగుల టార్గెట్ పెట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(83), శివం దూబే (52) అర్ధ శతకాలతో చెలరేగారు. చివర్లో మోయిన్ అలీ(19), రవీంద్ర జడేజా(10) ధనాధన్ ఆడడంతో 6 వికెట్ల నష్టానికి చెన్నై భారీ స్కోర్ చేసింది. హర్షల్ పటేల్, మ్యాక్స్‌వెల్ వేసిన 20వ ఓవర్లో 16రన్స్ వచ్చాయి.
Relief for @RCBTweets as Shivam Dube departs after an electrifying 52 off 27 💥@WayneParnell gets the wicket and @mdsirajofficial takes a sharp catch near the ropes 👌👌
Follow the match ▶️ https://t.co/nvoo5Sl96y #TATAIPL | #RCBvCSK pic.twitter.com/rQYEQH6BXZ
— IndianPremierLeague (@IPL) April 17, 2023
టాస్ ఓడిపోయిన చెన్నైకి మూడో ఓవర్లోనే షాక్.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే(83), అజింక్యా రహానే(37) ఇన్నింగ్స్ నిర్మించారు. రెండో వికెట్‌కు 74 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే(52) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడిన అతను 25 బంతుల్లో 2 పోర్లు ఐదు సిక్స్‌లతో ఫిఫ్టీ కొట్టాడు. అంబటి రాయడు (14) ఫర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, విజయ్‌కుమార్ వైశాక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, వేనీ పార్నెల్, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ తీశారు.