షాంఘై: చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 పోటీలలో ఇద్దరు భారత కాంపౌండ్ ఆర్చర్లు సెమీస్‌కు అర్హత సాధించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో రిషభ్ యాదవ్, మహిళల కేటగిరీలో మధుర సెమీస్ చేరారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ రిషభ్.. డెన్మార్క్ ఆర్చర్ మాథియస్ ఫుల్లర్టన్ను షూటాఫ్‌లో ఓడించాడు.
147-147తో స్కోర్లు సమం కాగా షూటాఫ్‌లో రిషభ్.. 10+ పాయింట్లతో ఫైనల్-4కు దూసుకెళ్లాడు. మహిళల క్వార్టర్స్‌లో మధుర 142-141తో భారత్‌కే చెందిన వెన్నం జ్యోతి సురేఖపై విజయం సాధించింది. తన కెరీర్లో రెండో ప్రపంచకప్ ఆడుతున్న మధుర.. సెమీస్‌లో టర్కీ ప్లేయర్ హజల్తో అమీతుమీ తేల్చుకోనుంది.