Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. పారా షాట్‌పుట్‌లో సోనమ్ రానా (Sonam Rana), శుభమ్ జుయల్(Shubham Juyal)లు తొలి రెండు స్థానాల్లో నిలిచి పసిడి, రజత పతకాలు సాధించారు. శనివారం జరిగిన పురుషుల ఎఫ్ 57 ఫైనల్లో సోనమ్ ఇనుపగుండును ఏకంగా 13.40 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుపొందాడు. అతడిని అనుసరించిన శుభమ్ 13.28 మీటర్లతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
గ్లాస్గో ఆతిథ్యమిస్తున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. పదోరోజును బాక్సర్లు ప్రీతి పవార్ (Preeti Pawar), జాస్మినెలు స్వర్ణం ప్రారంభించగా.. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్(Praveen Chithravel), సెల్వ ప్రభు తిరుమరన్ (Selva Prabhu Tirumaran)లు రజతం, కాంస్యం సాధించారు. డెకథ్లాన్లో దేశానికి మొట్ట మొదటి పతకం అందించాడు తేజస్విన్ శంకర్ (Tejaswin Shankar). బాక్సర్ జై డిక్సన్ 55 కిలోల విభాగంలో రజతంతో సరిపెట్టుకున్నాడు. వీరి స్ఫూర్తితో పారా అథ్లెట్లు సైతం పతకాలు కొల్లగొట్టారు.
Praveen Chithravel produces a colossal 16.58m jump on his 4th attempt to seal the SILVER MEDAL in the Men’s Triple Jump! 🥈
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/H1izg6ElRL
— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2026
Para Athletics: 🇮🇳 Soman Rana wins GOLD in Men’s F57 Shot Put final with a with best throw of 13.40m 🥇
▶️ Follow here for live updates from Day 9 of the 2026 Commonwealth Games: https://t.co/EUGEZUgnWi pic.twitter.com/YUefVz5yBT
— ESPN India (@ESPNIndia) August 1, 2026
హోరాహోరీగా సాగిన పారా షాట్‌పుట్ ఫైనల్లో అదరగొట్టిన సోనమ్ రానా, శుభమ్ జుయల్లు స్వర్ణ, రజత పతకాలను ఒడిసిపట్టారు. సోనమ్ 13.40 మీటర్లు, శుభమ్ 13.28 మీటర్ల దూరం ఇనుపగుండును విసిరి ప్రథమ, ద్విఈయా స్థానాల్లో నిలిచారు. వీరి కంటే ముందే.. పారా షాట్‌పుట్ మహిళల విభాగంలో 40 ఏళ్ల షర్మిలా ధన్కర్ దేశానికి మొట్టమొదటి పసిడి అందించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ పారా షాట్‌పుట్‌లో.. 20 ఏళ్లుగా పతకం కోసం నిరీక్షిస్తున్న భారత అథ్లెట్ల కలను సాకారం చేసింది షర్మిల.
🥈 Silver for Jadumani Singh in the men’s 55kg boxing final!
Australia’s Jye Dixon claimed a unanimous 5-0 victory to take the Commonwealth Games gold, while Jadumani capped off a spirited campaign with a silver medal for India 🇮🇳
📸: PTI #CWG2026 #JadumaniSingh #Boxing pic.twitter.com/sRdYUUczSA
— Sportstar (@sportstarweb) August 1, 2026