Mohammed Shami: టచ్ చేస్తే క్యాచ్.. మిస్ అయితే వికెట్.. కర్మగాలి రెచ్చగొడితే ఆ బ్యాటర్‌కు సాగరసంగమమే అన్నట్టుగా సాగుతోంది వరల్డ్ కప్‌లో టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్ విధ్వంసం. వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన గత మూడు మ్యాచ్‌లలో రోహిత్ సేన విజయానికి కీలకంగా వ్యవహరించిన బౌలర్ షమీ అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ ప్రపంచకప్‌కు ముందు అసలు జట్టులో ఉంటాడా..? లేదా..? అన్న అనుమానాల నుంచి టోర్నీ ఆడేందుకు అనుమతి దక్కినా తొలి నాలుగు మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇక షమీ పని అయిపోయినట్టే అనుకున్నారంతా. కానీ షమీ స్క్రిప్ట్ మరోలా ఉంది.
సమస్యల సుడిగుండంలో..
గత రెండుమూడేండ్లుగా షమీ తన కెరీర్లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. వృత్తిపరంగానే గాక వ్యక్తిగత జీవితంలో కూడా షమీ తీవ్ర క్షోభ అనుభవిస్తున్నాడు. తన మాజీ భార్య హసీన్ జహాన్ వేధింపులు, విడాకుల కేసు, తన కూతురును తనకు కాకుండా చేయడంతో ఒకదశలో ఆత్మహత్యకు కూడా పాల్పడేందుకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ముస్లిం కావడం వల్లే పాకిస్తాన్‌కు అనుకూలంగా బౌలింగ్ చేశాడని షమీ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వచ్చింది. ఇలాంటివి ఒక్కటి కాదు, సమస్యల సుడిగండంలో చిక్కుకున్న షమీ ఈ నాలుగేండ్లు దినదినగండంగా గడిపాడు. దీనికి తోడు పేలవ ఫామ్‌తో ఇక రిటైరైవవ్వడమే బెటర్ అన్న వాదనలు, జట్టులో చోటు కోల్పోయే దాకా వచ్చింది షమీ పరిస్థితి. గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిశాక పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దాదాపుగా షమీని పక్కనబెట్టింది.
He is Mohammed Shami, Indian Cricketer. My respect for him has gone up. 🔥
In the last 4 years, he faced fake charges from his wife. He could not meet his daughter when she was sick.
BJP supporters heckled him in the stadium with religious chanting and then he was kept out of… pic.twitter.com/jwYG78vtxp
— Amock (@Politics_2022_) November 2, 2023
మొన్నటిదాకా అంతంతమాత్రమే..
తనపై తన భార్య చేసిన ఆరోపణలు, ఇతరత్రా విషయాలపై మౌనం వహించిన షమీ వాటన్నింటికీ బంతితోనే సమాధానమిస్తున్నాడు. గతేడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత వన్డేలలో చోటు కోల్పోయిన షమీ.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సిరీస్‌లో మూడు వికెట్లు మాత్రమే తీసిన షమీ.. కివీస్‌తో సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్చిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ రానించాడు. ఆసియా కప్‌లో అతడికి పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. దీంతో వన్డే వరల్డ్ కప్‌లో షమీకి చోటు దక్కకపోవచ్చని.. ఒకవేళ ఆడినా బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినిపించాయి. వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లలో ఇదే జరిగింది. ఆల్ రౌండర్ లక్షణాలు లేకున్నా ఆ ట్యాగ్ తగిలించుకుని జట్టులో వరుస అవకాశాలు దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్ కోసం భారత్.. షమీని పక్కనబెట్టింది. కానీ శార్దూల్ టీమ్‌కు భారం అయ్యాడే గానీ బలం కాలేదు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ మళ్లీ షమీ వైపునకే మొగ్గుచూపింది.
Meet Mohammed Shami
– Got tortured by own wife, leaked screenshots were spread to defame him, demean him
– Wife kept making his life hell
– didnt let himself break
– gathered himself, made a comeback and today became India’s highest wicket taker in world cups.
Always… pic.twitter.com/Q624jFInkv
— Roshan Rai (@RoshanKrRaii) November 2, 2023
కెరటంలా దూసుకొచ్చి..
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడిన షమీ.. పది ఓవర్లు వేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అయితే బెన్ స్టోక్స్ వంటి దిగ్గజ బ్యాటర్‌ను షమీ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఓ ఓవర్లో నాలుగు బంతులు ఎదుర్కున్న స్టోక్స్.. ఇక నావల్ల కాదు అని పెవిలియన్‌కు చేరాడు. బెయిర్ స్టోదీ అదే దుస్థితి. ఈ మ్యాచ్‌లో ఏడు ఓవర్లు వేసి 22 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక పసికూన శ్రీలంకనైతే షమీ బౌలింగ్ దాడిని తట్టుకోలేక విలవిల్లాడింది. నిన్నటి మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన షమీ.. ఒక మెయిడిన్ చేసి 18 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. గురువారం షమీ ప్రదర్శన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది అసలైన కమ్ బ్యాక్’ అంటూ కీర్తిస్తున్నారు.
— Tasneem Hanif 🇮🇳 (@TasneemKhatai) November 2, 2023