Coco Gauff | మసోన్ (యూఎస్): డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) సిన్సినాటి ఓపెన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పరాభవాన్ని చవిచూసింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా తొలి రౌండ్లో బై దక్కగా రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో గాఫ్ 4-6, 6-2, 4-6తో యులియ పుటింట్సెవ (కజకిస్థాన్) చేతిలో ఓడింది. గతేడాది సిన్సినాటి ఓపెన్ నెగ్గి ఆ వెంటనే యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన గాఫ్ ఈసారి తొలి మ్యాచ్‌లోనే ఓడింది. పురుషుల సింగిల్స్‌లో సిట్సిపస్, దిమిత్రోవ్, మెద్వెదెవ్ వంటి టాప్ సీడ్ ఆటగాళ్లంతా రెండో రౌండ్‌కే వెనుదిరగడం గమనార్హం.
ఆధిక్యంలో సఫారీలు
గయానా: వెస్టిండీస్‌తో గయానా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతోంది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు 16 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా.. 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది.