క్వీన్ గాఫ్
అమెరికా యువ సంచనలం కోకో గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ముద్దాడింది. కెరీర్ ఆరంభంలోనే టెన్నిస్ ప్రపంచాన్ని విస్మయపరిచే విజయాలు ఖాతాలో వేసుకున్న గాఫ్.. సొంతగడ్డపై జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 19 ఏండ్ల గాఫ్ 2-6, 6-3, 6-2తో అరియానా సబలెంకను మట్టికరిపించింది.
- ఫైనల్లో సబలెంక ఓటమి
- యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
న్యూయార్క్: అమెరికా యువ సంచనలం కోకో గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ముద్దాడింది. కెరీర్ ఆరంభంలోనే టెన్నిస్ ప్రపంచాన్ని విస్మయపరిచే విజయాలు ఖాతాలో వేసుకున్న గాఫ్.. సొంతగడ్డపై జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 19 ఏండ్ల గాఫ్ 2-6, 6-3, 6-2తో అరియానా సబలెంకను మట్టికరిపించింది. యూఎస్ ఓపెన్‌లో బరిలోకి దిగడానికి పది నిమిషాల ముందు వరకు సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉన్న ఈ టీనేజర్.. ట్రోఫీ నెగ్గిన అనంతరం వివర్శకులు, ట్రోలర్స్‌కు ఇదే తన జవాబని గద్గద స్వరంతో ప్రకటించింది. అమెరికా దిగ్గజ ప్లేయర్లు సెరెనా, వీనస్ ఆట చూసేందుకు గతంలో పలుమార్లు యూఎస్ ఓపెన్ మైదానాలకు వచ్చిన గాఫ్..

ఇప్పుడు అదే స్టేడియంలో విజయనాదం చేసింది. తొలి సెట్లో పరాజయం పాలైన గాఫ్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. రెండు గంటలకు పైగా సాగిన సమరంలో 5 బ్రేక్ పాయింట్లు సాధించిన గాఫ్ 13 విన్నర్స్ కొట్టింది. మరోవైపు 4 ఏస్‌లు బాదిన సబలెంక.. 46 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం గాఫ్ మాట్లాడుతూ.. ‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఇది నాకోసం సాధించింది. గతంలో దగ్గరి వరకు వచ్చి ఓడిపోవడంతో చాలా నిరాశ చెందా. ఇప్పుడు స్వప్నం సాకారమైనట్లు అయింది’ అని పేర్కొంది. సెరెనా విలియమ్స్ (1999) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా టీనేజర్‌గా గాఫ్ రికార్డుల్లోకెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

