రియాద్ (సౌదీ అరేబియా): అమెరికా యువ టెన్నిస్ సంచలనం కోకో గాఫ్ రియాద్ వేదికగా జరిగిన ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) టైటిల్‌ను గెలుచుకుంది. రియాద్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో 20 ఏండ్ల గాఫ్.. 3-6, 6-4, 7-6 (7/2)తో చైనా అమ్మాయి, పారిస్ ఒలింపిక్ చాంపియన్ అయిన కిన్వెన్ జెంగ్‌ను చిత్తుచేసి తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఇరువురు తలో సెట్ గెలవగా ఒకదశలో గాఫ్ 0-2తో వెనుకబడింది. మూడో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో గాఫ్ అద్భుతమైన ఫోర్ హ్యాండ్ షాట్‌తో మూడో మ్యాచ్ పాయింట్ సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.