Kranti Gaud : వన్డే ప్రపంచ కప్‌లో భారత యువ పేసర్ క్రాంతి గౌడ్ (Kranti Gaud) రాణించిన తీరు అమోఘం. సీనియర్ రేణుకా సింగ్‌తో కలిసి కొత్త బంతితో నిప్పులు చెరిగిన క్రాంతి.. జట్టు విజయంలో కీలకంగా మారింది. విశ్వ విజేతగా నిలిచిన ఆమె తమ కుటుంబంలో పండుగ తీసుకొచ్చింది. అవును.. కొన్నేళ్ల క్రితం సస్పెండ్ అయిన ఆమె తండ్రి మున్నా సింగ్ గౌడ్ మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. దాంతో.. కూతురి వరల్డ్ కప్ ప్రదర్శనకు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకుంది.
వరల్డ్ కప్ ఛాంపియన్‌గా స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌లో అడుగుపెట్టిన క్రాంతి గౌడ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. భోపాల్‌లోని తన నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) యువ పేసర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆమె తల్లిదండ్రులు, కోచ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం క్రాంతిని ప్రశంసించారు. అంతేకాదు రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రాంతికి ఆయన గుడ్‌న్యూస్ చెప్పారు. గతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి.. సస్పెండ్ అయిన ఆమె తండ్రి మున్నా సింగ్‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో.. క్రాంతి కుటుంబం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసింది.
Upon returning to her home state of Madhya Pradesh, Kranti Gaud was honored by Chief Minister Dr. Mohan Yadav, fulfilling her dream of having her father reinstated and regaining his ‘dignity,’ a desire she articulated in an interview.
Read Here: https://t.co/HLk9MPm8Nc… pic.twitter.com/woz6BJLwnP
— DNA (@dna) November 9, 2025
మధ్యప్రదేశ్ పోలీస్ విభాగంలో మున్నా సింగ్ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు. అయితే.. కొన్ని కారణాల వల్ల 2012లో ఆయన సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ల కుటుంబానికి ఆర్దిక కష్టాలు మొదలయ్యాయి. డబ్బులు లేకపోవడంతో తాము కొన్నిరోజులు ఒకటే పూట తిన్నామని క్రాంతి తెలిపింది. కష్టాలను అనుభవిస్తూ పెరిగిన క్రాంతి.. పేస్ బౌలర్‌గా రాణించి సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఈమధ్యే తాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మా నాన్న మళ్లీ పోలీస్ ఉద్యోగంలో చేరి.. గౌరవంగా రిటైరవ్వాలని కోరుకుంటున్నా’అని చెప్పింది. ఈ వీడియో సీఎం దృష్టికి రావడంతో వరల్డ్ కప్ విజేత క్రాంతికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. ఆదివారం నిర్వహించిన సత్కార కార్యక్రమంలో ఆమె తండ్రిని తిరిగి పోలీస్ జాబ్‌లోకి తీసుకుంటామని సీఎం ప్రకటించారు.
Kranti Gaud 🤝 Early breakthroughs! 🔥#CricketTwitter #CWC25 #INDvNZpic.twitter.com/mrYlNeiq1Q
— Female Cricket (@imfemalecricket) October 23, 2025