హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : హెచ్‌సీఏ కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా చేసుకొని నిందితులను సీఐడీ విచారిస్తున్నది. మూడవ రోజు కస్టడీలో భాగంగా శనివారం ఇద్దరు నిందితులైన హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్‌ను తీసుకువచ్చిన సీఐడీ అధికారులు పలు రికార్డులను చూపించి.. వివరాలు సేకరించారు.
ఇప్పటికే ఈ కేసులో జగన్మోహన్రావు ను స్టేడియానికి తీసుకొచ్చి.. సీఐడీ అధికారులు విచారించారు. అధ్యక్షుడిగా జగన్మోహన్రావు ఎన్నికైనప్పటి నుండి స్టేడియంలో అన్నీ కలిసి 500 మ్యాచ్‌లు జరిగినట్లు తేల్చారు. ఈ మ్యా చ్ల సందర్భంగా హెచ్‌సీఏ ఖర్చు చేసిన రికార్డులను పరిశీలించిన సీఐడీ అధికారులు.. రికార్డుల్లో ఉన్న లెకలపై జగన్మోహన్రా వు, ఇతర నిందితుల నుంచి వివరాలు రాబట్టారు.