ఈ ఏడాది బాలన్ డీఆర్ అవార్డు అందుకున్న ఫుట్‌బల్ సూపర్ స్టార్ క్రిస్టియనో రొనాల్డో.. తన గర్ల్‌ఫ్రెండ్ పుట్టినరోజు కోసం పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. సుమారు 50 వేల పౌండ్లు ఖర్చుపెట్టి బుర్జ్ ఖలీఫాపై తన ప్రేయసి జార్జినా ఫొటోలతో ఒక వీడియో ప్లే చేయించాడు.
అంతర్జాతీయంగా సుమారు 370 మిలియన్ డాలర్ల విలువ కలిగిన రొనాల్డో.. గురువారం రాత్రి బుర్జ్ ఖలీఫాను తన 28 ఏళ్ల ప్రేయసి ఫొటోలు, వీడియోలతో నింపేశాడు. 36 ఏళ్ల రొనాల్డో, జార్జినాకు నాలుగేళ్ల బిడ్డ కూడా ఉంది. ప్రస్తుతం ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న రొనాల్డో.. వింట్ బ్రేక్‌లో కుటుంబంతో కలిసి దుబాయ్‌లో గడుపుతున్నాడు.
ఈ క్రమంలోనే తన ప్రేయసి పుట్టిన రోజును ఇలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ లైట్ అండ్ లేజర్ షో అద్భుతంగా సాగింది. మధ్యలో ‘హ్యాపీ బర్త్‌డే జియో’ అంటూ అక్షరాలు అందరినీ ఆకర్షించాయి. అర్జెంటీనాలో పుట్టిన జార్జీనా.. 2016లో రొనాల్డోను కలిసింది. లా లిగా జయింట్స్ రియల్ మాడ్రిడ్‌లో అతను ఉండగా వీళ్లిద్దరూ కలిశారు.
ఆ తర్వాత ప్రేమలో పడిన ఇద్దరూ అప్పటి నుంచి కలిసే ఉన్నారు. బుర్జ్ ఖలీఫాపై ఇలా ప్రమోషన్ చేయడం ఇటీవలి కాలంలో చాలా పాపులర్‌గా మారింది. మూడు నిమిషాల ప్రదర్శన కోసం నిర్వాహకులు 50 వేల పౌండ్లు వసూలు చేస్తారు. ఈ రేటు వీకెండ్స్‌లో మరింత పెరుగుతుంది.