ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌లో అమెరికా క్రీడా దిగ్గజాలు లారీ ఫిట్జ్‌గెరాల్డ్, క్రిస్ పాల్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చారు. వీరిద్దరితోపాటు కెల్విన్ బీచమ్ కూడా రాయల్స్‌లో భాగస్వామి కానున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ జట్టు యాజమాన్యం ఆదివారం ప్రకటించింది. ‘అమెరికా ఫుట్‌బాల్ దిగ్గజం ఫిట్జ్‌గెరాల్డ్, ఒలింపిక్స్ రెండు స్వర్ణ పతకాల విజేత, బాస్కెట్‌బాల్ స్టార్ క్రిస్ పాల్, ఎన్ఎఫ్ఎల్ స్టార్ కెల్విన్‌లను రాజస్థాన్ రాయల్స్ ఆకర్షించింది. ఆ ముగ్గురు బోర్డులో ఇన్వెస్టర్లుగా చేరారు. క్రిస్, లారీ, కెల్విన్ పెట్టుబడిదారులుగా రావడం ఆనందంగా ఉంది. మా ఫ్రాంచైజీ అంతర్జాతీయ బ్రాండ్‌గా రూపుదిద్దుకుంటున్నది’ అని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా సీజన్లో రాజస్థాన్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లాడి ఆరింట నెగ్గి.. ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నది.