టోక్యో: ఒలింపిక్స్ తొలి గోల్డ్ మెడల్ చైనా ఖాతాలోకి వెళ్లింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో చైనాకు చెందిన యాంగ్ కియాన్ ఈ మెడల్ గెలిచింది. చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఈ ఈవెంట్లో రష్యా షూటర్ అనస్తేసియా గలేషినా సిల్వర్‌తో సరిపెట్టుకుంది. చివరి షాట్లో ఆమెను అధిగమించి గోల్డ్ ఎగరేసుకుపోయింది యాంగ్ కియాన్. ఆమె ఒలింపిక్ రికార్డ్ స్కోరు అయిన 251.8 సాధించడం విశేషం.
అటు గలేషినా 251.1 పాయింట్లతో తృటిలో గోల్డ్ మిస్సయింది. ఇక స్విట్జర్లాండ్‌కు చెందిన నినా క్రిస్టెన్ 230.6 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ గెలిచింది. యాంగ్‌కు గోల్డ్ మెడల్‌ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాక్ బహూకరించారు. ఈసారి పోడియంపై కూడా మాస్కులు పెట్టుకునే కనిపించిన అథ్లెట్లు.. మెడల్ కూడా ఎవరికి వాళ్లే తీసుకొని మెడలో వేసుకున్నారు.
నిరాశ పరిచిన ఇండియన్ షూటర్లు
ఈ ఒలింపిక్స్‌లో ఇండియాకు మెడల్ ఆశలు రేపిన గేమ్స్‌లో షూటింగ్ కూడా ఒకటి. కానీ తొలి ఈవెంట్లోనే తీవ్రంగా నిరాశపరిచారు మహిళా షూటర్లు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఇండియన్ షూటర్లు ఇద్దరు ఉన్నా.. కనీసం ఫైనల్ కూడా చేరుకోలేకపోయారు. ఎన్నో ఆశలు రేపిన ఎలవనిల్ వలరివన్, సీనియర్ అపూర్వి చండీలా ఇద్దరూ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయారు. ఎలవనిల్ 626.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలవగా.. అపూర్వి చండీలా 621.9 పాయింట్లతో 36వ స్థానంతో సరిపెట్టుకుంది.
The first gold medal of #Tokyo2020 goes to China's Qian Yang 🥇
— SportsCenter (@SportsCenter) July 24, 2021
She finished with an Olympic record 251.8 in the women's 10-meter air rifle. pic.twitter.com/k4nvNJBmhb