చెంగ్జొ: చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో తన కంటే మెరుగైన ప్రత్యర్థులను చిత్తుచేసి క్వార్టర్స్ చేరిన భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో మాళవిక 10-21, 16-21తో అకానె యమగుచి (జపాన్) చేతిలో ఓడింది. 35 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో ప్రపంచ ఐదో ర్యాంకర్ యమగుచి ధాటికి మాళవిక నిలువలేకపోయింది. మాళవిక ఓటమితో ఈ టోర్నీ లో భారత పోరాటం ముగిసినైట్టెంది.