Malvika Bansod | చెంగ్జొ (చైనా): భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్.. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించింది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 22 ఏండ్ల మాళవిక.. 26-24, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ అయిన గ్రెగోరియా మరిస్క (ఇండోనేషియా)ను ఓడించింది. మరిస్క ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించడం గమనార్హం. 46 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన పోరులో మాళవిక మ్యాచ్ ఆద్యంతం పట్టుదలతో ఆడి వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఇదే టోర్నీలో త్రిసా-గాయత్రి, సుమిత్-సిక్కి, ఆకర్షి కశ్యప్, కిరణ్ జార్జి వంటి యువ ఆటగాళ్లు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు.