టాంటన్: పేలవ ఫామ్‌తో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ వన్డే కప్‌లో వరుస సెంచరీలతో జోరు కనబరుస్తున్నాడు. ససెక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా (113 బంతుల్లో 117 నాటౌట్; 11 ఫోర్లు).. సోమర్‌సెట్‌తో జరిగిన పోరులో అజేశ శతకంతో చెలరేగాడు. మొదట బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 318 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పుజారా దుమ్మురేపడంతో ససెక్స్ 319 పరుగులు చేసింది.