హైదరాబాద్, ఆట ప్రతినిధి: పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరమ్(పీఎన్ఆర్ఐఎఫ్) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహబూబునగర్ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు ఒక సంఘంగా ఏర్పడి విద్య, సామాజిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రవీంద్రభారతిలో చెస్ నెట్వర్క్ పిలుపుతో పాలమూరులోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు చెస్బోర్డులు అందించేందుకు సిద్ధమైంది.
పాత పాలమూరు జిల్లాలోని 80 మండల్లాలోని స్కూళ్లకు దాదాపు 10వేల చెస్ బోర్డులు ప్రదానం చేయనున్నారు. పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.