ఐపీఎల్ స్టార్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్.. తాజాగా ఈద్ సంబరాలు చేసుకుంది. సీజన్ ఆరంభంలో జట్టుకు సారధ్యం వహించిన రవీంద్ర జడేజా.. తన ఆటతీరుపై ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీని మళ్లీ ధోనీకి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సన్‌రైజర్స్‌తో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విక్టరీ సాధించింది.
ఈ క్రమంలోనే తాజాగా జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మొయీన్ అలీ, డ్వేన్ బ్రావో, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి ఈద్ సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో పిల్లలతో కలిసి కూర్చున్న ధోనీ.. వాళ్లకు ముచ్చట్లు చెప్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
EIDhu Namma Kondattam! 💛
Celebrating the festivities the SuperKings way🦁#Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/HecryvhKVn— Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2022