IPL-2021 | ప్లేఆఫ్‌కు చెన్నై.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో విజయం
IPL-2021 | గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి ఫ్లేఆఫ్‌కు చేరుకున్నది.

IPL-2021 | షార్జా వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తొలిసారి ఫ్లేఆఫ్‌కు చేరుకున్న జట్టుగా నిలిచింది. హైదరాబాద్ సన్ రైజర్స్ విధించిన 135 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 45, డుప్లెసిస్ 41 పరుగులతో విరుచుకుపడ్డారు. ప్రారంభంలోనే ఫోర్లు, సిక్సర్లు బాదారు.
కానీ జట్టు స్కోర్ 100 పరుగులు దాటాక మొయిన్ అలీ (17), సురేశ్ రైనా (2), డుప్లెసిస్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. వేగం మందగించడంతో గెలుపొందాలంటే రెండు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన పరిస్థితి. చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులకు సన్ రైజర్స్ బౌలర్ సిద్దార్థ్ కౌశల్ ఒకే పరుగు ఇచ్చారు.
ఇక నాలుగో బంతిని సారధి ఎంఎస్ ధోనీ సిక్సర్‌గా మల్చడంతో చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. అంతకుముందు సన్ రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

