చెన్నై: భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నాగల్.. చెన్నై ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాగల్ 6-3, 6-3తో డొమినిక్ పలన్ (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు.
రెండో సీడ్‌గా బరిలోకి దిగిన నాగల్.. వరుస సెట్లలో ప్రత్యర్థి పని పట్టాడు. మూడు ఏస్‌లు సంధించిన నాగల్.. 3 బ్రేక్ పాయింట్లు కైవసం చేసుకున్నాడు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌లో సాకేత్-రామ్‌కుమార్.. రిత్విక్-నిక్కి పునాచ జోడీలు ఫైనల్‌కు అర్హత సాధించాయి.