హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్పోర్ట్స్ పాలసీతో తెలంగాణ క్రీడారంగంలో మార్పులు రాబోతున్నాయి. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో సాట్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ హబ్, సీఎం కప్ నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది.
సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాల సభ్యులు ప్రాతిపాదిత స్పోర్ట్స్ పాలసీలో ముఖ్య అంశాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఏఏ విభాగాలు ఏర్పాటు చేయబోతున్నారో వివరించారు. వివిధ టోర్నీల్లో తెలంగాణ క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ నగదు ప్రోత్సహకాలను, ఉద్యోగ అవకాశాలను నూతన స్పోర్ట్స్ పాలసీలో స్పష్టం చేయబోతున్నట్లు చైర్మన్ తెలిపారు.