హైదరాబాద్, ఆట ప్రతినిధి: మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ క్లాస్ విబాగంలో చంద్రలేఖ తట్టారి-ధనుష్ జక్కుల జోడీ వరుసగా రెండు రేసుల్లో విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బద్రీనాథ్ – రిశ్వింత రెండో స్థానంలో నిలిచింది. టాప్ సీడ్ సెయిలర్ దీక్షిత కొమరవెల్లి బోటు తిరగబడటంతో ఆమె భుజానికి తీవ్ర గాయమైంది. స్కిఫ్ క్లాస్ 29ఇఆర్ బోట్ విభాగంలో వినోద్ దండు-అరవింద్ మాలోత్ ద్వయం ముందంజలో ఉండగా.. అండర్-15 ఆప్టిమిస్ట్ క్లాస్లో సికింద్రాబాద్ క్లబ్ సెయిలర్ శృంగేరి రాయ్ రెండో రేసులో విజయం సాధించింది.