IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో కొందరు క్రికెటర్లు ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బురపరుస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంక ఆటగాళ్లు పక్షిలా గాల్లో తేలుతూ క్యాచ్‌లు అందుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కమిందు మెండిస్(Kamindu Mendis) గాల్లో డైవ్ చేసి.. కుడివైపు శరీరాన్ని సాగదీస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ధాటిగా ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్‌ను డగౌట్‌కు చేర్చాడు మెండిస్. ఇప్పుడు లంక పేసర్ దుష్మంత చమీరా (Dushmantha Chameera) సైతం అలాంటి క్యాచ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో చమీరా తన ఫీల్డింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన 20వ ఓవర్లో అనుక్లో రాయ్(Anukul Roy) లెగ్ సైడ్ గాల్లోకి లేపిన బంతిని బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరేలా అందుకున్నాడు. పరుగెడుతూ వచ్చి అమాంతం గాల్లోకి ఎగిరిన చమీరా… రెండు చేతులతో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దాంతో.. అనుకుల్ సహా కోల్‌కతా డగౌట్ మొత్తం షాక్‌లో ఉండిపోయింది. స్టేడియంలోని అభిమానులు, కామెంటేటర్లు అయితే వాట్ ఏ క్యాట్ అంటూ ఫిదా అయిపోయారనుకో.
A 106m monster and then Dushmantha Chameera goes superman mode.
Contender for the catch of the season?#IPL2025 | #DCvKKR pic.twitter.com/haPubytcQP
— Cricket.com (@weRcricket) April 29, 2025