County Championship : విదేశీ లీగ్స్‌లో భారత క్రికెటర్లు మెరవడం కొత్తేమీ కాదు. తాజాగా ఇంగ్లండ్ గడ్డపై ఐపీఎల్ స్టార్ రాహుల్ చాహర్ (Rahul Chahar) తన బౌలింగ్ ప్రతాపం చూపించాడు. కౌంటీ ఛాంపియన్షిప్ (County Championship)లో చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. అరంగేంట్రంలోనే పది వికెట్లతో సర్రే (Surrey) జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లతో హ్యాంప్‌షైర్ (Hampshire) నడ్డివిరిచాడీ స్పిన్ సంచలనం.
కౌంటీల్లో సర్రే జట్టు తరఫున రాహుల్‌దే అత్యుత్తమ ప్రదర్శన. గతంలో విలియం ముడీ (William Mudie) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రాహుల్. 1859లో ఓవల్ మైదానంలో నార్త్ జట్టుపై విలియం 7/61తో చెలరేగాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన ఈ లెగ్ స్పిన్నర్ తన మొదటి మ్యాచ్‌లోనే 10/118తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
Rahul Chahar’s 8/51 was the best figures on Surrey debut. 🤩
The previous best was 7/61 by William Mudie vs the North at the Oval in 1859.
Instant impact! 📈
🤎 | #SurreyCricket pic.twitter.com/NKP95ji6CR
— Surrey Cricket (@surreycricket) September 27, 2025
సౌతాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో సర్రే జట్టు 147కే ఆలౌటయ్యింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (29), డాన్ లారెన్స్(36)లు మాత్రమే రాణించారు. అనంతరం వాషింగ్టన్ సుందర్(56) హాఫ్ సెంచరీ, కెప్టెన్ బ్రౌన్(37)లు మెరుపులతో హ్యాంప్‌షైర్ 248 రన్స్‌కు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సిబ్లే(44), ఫోక్స్(43), డాన్ లారెన్స్(47)ల పోరాటంతో సర్రే 281 పరుగులకు పరిమితమైంది. స్వల్ప ఛేదనకు దిగిన హ్యాంప్‌షైర్‌ను రాహుల్ ఆది నుంచి దెబ్బకొడుతూ వచ్చాడు. ఓపెనర్లను పెవిలియన్ పంపిన అతడు.. మిడిల్, లోయర్ ఆర్డర్‌ను చుట్టేసి సర్రేకు 20 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు.