IPL 2025 : పంజాబ్ కింగ్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కీలక వికెట్లు కోల్పోయింది. చాహల్(2-9) విజృంభణతో ధాటిగా ఆడుతున్న అజింక్యా రహానే(17), అంగ్క్రిష్ రఘువంశీ(37)లు పెవిలియన్ చేరారు. దాంతో,76కే కోల్‌కతా 4 వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం వెంకటేశ్ అయ్యర్(7), రింకూ సింగ్(1)లు ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్. ఇంకా పంజాబ్ విజయానికి 40 రన్స్ అవసరం.
స్వల్ప ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు విఫలం అయ్యారు. యాన్సెస్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(5) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జేమ్స్ బార్ట్లెట్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన క్వింటన్ డికాక్(2).. బౌండరీ లైన్ వద్ద సూర్యాన్ష్ షెడ్గే చేతికి చిక్కాడు. దాంతో, 7 పరుగలకే రెండు వికెట్లు కోల్పోయింది కోల్‌కతా. ఆ తర్వాత అంగ్క్రిష్ రఘువంశీ(37), అజింక్యా రహానే(17)లు దూకుడుగా ఆడి స్కోర్ 50 దాటించి పంజాబ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
Low-scoring thriller on the cards? 👀
Yuzvendra Chahal & Glenn Maxwell deliver crucial breakthroughs to put the game in balance 👊
Updates ▶️ https://t.co/sZtJIQpcbx#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/kv64WUZ7P7
— IndianPremierLeague (@IPL) April 15, 2025
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ సొంతగడ్డపై కుప్పకూలింది. ముల్లనూర్‌లో టాపార్డర్ వైఫల్యంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల విజృంభణతో పంజాబ్ 15.3 ఓవర్లకే ఆలౌటయ్యింది. పేసర్ హర్షిత్ రానా(3-25) నిప్పులు చెరగగా.. స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి(2-21), సునీల్ నరైన్(2-14)లు తిప్పేశారు. దాంతో, 111 పరుగులకే పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.