ముంబై : టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వివాహ బంధానికి తెరపడ్డట్టే! గత కొంతకాలంగా విడాకుల వార్తలు వినిపిస్తున్న వేళ ఈ ఇద్దరూ.. 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ధనశ్రీకి భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్ అంగీకరించినట్టు (ఇప్పటికే ఇందులో రూ. 2.37 కోట్లు చెల్లించాడు) తెలుస్తోంది. భరణం విషయంలోనూ ధనశ్రీ రూ. 60 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలు రాగా అవన్నీ పుకార్లే అని తేలింది. ఇక 2022 నుంచే ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారట. పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించగా అందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. దీనిని సవాల్ చేస్తూ చాహల్ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా అందుకు న్యాయస్థానం పిటీషన్‌దారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2022 నుంచే విడివిడిగా ఉంటున్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో త్వరలోనే వీరి విడాకులపై ప్రకటన వెలువడే చాన్స్ ఉంది.