గాలె: మిడిలార్డర్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (109 బ్యాటింగ్; 12 ఫోర్లు), మార్నస్ లబుషేన్ (104; 12 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్‌తో పాటు అలెక్స్ కారీ (16) క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 3 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.