బెంగళూరు: దులీప్ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంట్రల్ జోన్ పట్టు బిగిస్తున్నది. బెంగళూరులోని బీసీసీఐ సీవోఈ గ్రౌండ్స్ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో భాగంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ (101) మరోసారి శతకమోత మోగిస్తూ వెస్టిండీస్ సిరీస్‌కు ముందు సెలక్టర్లకు మరో తలనొప్పిని తీసుకొచ్చాడు.
ఈ ట్రోఫీ క్వార్టర్స్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రజత్.. సెమీస్‌లోనూ అర్ధ శతకం చేశాడు. ఫైనల్లో రజత్తో పాటు యశ్ రాథోడ్ (137 నాటౌట్) సైతం అజేయ శతకంతో మెరిశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ ఇప్పటికే 235 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.