హైదరాబాద్: క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ప్లేయర్లు పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో పాటు పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్పోర్ట్స్ కోటా కింద https://awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎవరైనా ప్లేయర్ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు కావాలంటే ఈనెల 31 లోపు తమను సంప్రదించాలని సాట్స్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.