హైదరాబాద్, ఆట ప్రతినిధి: సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ (సీసీపీఎల్)లో వైకింగ్స్ పీసీ విన్నర్‌గా నిలిచింది. హైదరాబాద్ గండిపేట్‌లోని క్రాస్ కోర్ట్స్ స్పోర్ట్స్ క్లబ్లో శనివారం జరిగిన ఫైనల్లో వైకింగ్స్ జట్టు 4-0 తో పెంగ్విన్ పీసీపై ఘన విజయం సాధించింది. నగరంలో పది వారాల పాటు సాగిన ఈ లీగ్‌లో 350 మందికి పైగా ప్లేయర్లు బరిలోకి దిగారు.